Header Banner

బీసీసీఐకి కొత్త టెన్షన్! మోదీ పర్మిషన్ ఇస్తారా..!

  Mon May 12, 2025 16:30        Sports

ఐపీఎల్-2025ని రీస్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది భారత క్రికెట్ బోర్డు. అన్నీ కుదిరితే ఈ వారాంతంలో క్యాష్ రిచ్ లీగ్ మిగిలిన మ్యాచులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం తేల్చుతుందనేది ఆసక్తికరంగా మారింది.

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్-2025 ఈ వారాంతంలో స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలు సీజ్‌ఫైర్‌కు అంగీకరించడంతో పరిస్థితులు క్రమంగా యథాస్థితికి చేరుకుంటున్నాయి. దీంతో క్యాష్ రిచ్ లీగ్‌ మిగిలిన మ్యాచుల్ని త్వరగా ఫినిష్ చేయాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది. టోర్నీ రీస్టార్ట్ చేయడంపై ఐపీఎల్ పాలకసభ్యులు, బీసీసీఐ పెద్దలు ఆదివారం డిస్కస్ చేశారు. మిగతా సీజన్ మ్యాచులకు సంబంధించిన ఏర్పాట్లు, షెడ్యూల్‌పై చర్చలు జరిపారు. అయితే మోదీ సర్కారు పర్మిషన్ ఇస్తే గానీ టోర్నీ మొదలవదు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదే క్యాష్ రిచ్ లీగ్ రీస్టార్ట్ ఆధారపడి ఉంది. ఇదే విషయాన్ని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చెప్పాడు. 

తేల్చేస్తారా..

ఐపీఎల్‌ మీద ఇప్పటిదాకా ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదన్నాడు రాజీవ్ శుక్లా. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. అయితే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ మీదే అంతా ఆధారపడి ఉందని తెలుస్తోంది. ఇవాళ భారత్-పాక్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. రెండు దేశాల మధ్య మధ్యాహ్నం 12 గంటలకు హాట్‌లైన్‌లో డిస్కషన్స్ నడుస్తాయి. సీజ్‌ఫైర్‌తో పాటు ఉద్రిక్త వాతావరణం తగ్గించడం లాంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ డిస్కషన్స్ తర్వాతే కాల్పుల విరమణపై పూర్తి స్పష్టత రానుంది. గుంటనక్క లాంటి పాక్.. భారత్‌ను రెచ్చగొట్టేందుకు మళ్లీ దాడులకు తెగబడదని కూడా చెప్పలేం. కాబట్టి ఈ విషయాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్‌ను ఇంకొన్నాళ్ల తర్వాత జరపాలా.. లేదా.. రాబోయే వారం, పది రోజుల్లో నిర్వహించాలా అనేది తేల్చే చాన్సులు ఉన్నాయి. అందుకే ఐపీఎల్‌కు మోదీ పర్మిషన్ ఇస్తారా.. లేదా ఇంకొన్ని వారాలు వాయిదా వేయాలని చెబుతారా.. అనేది క్లారిటీ లేదు.

ఇది కూడా చదవండి: వారికి శుభవార్త.. ఇంక నుండి ఆస్తి పన్ను ఉండదు! పవన్ సంచలన నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా! కీలక అప్‌డేట్!

 

భారత్ తో యుద్ధం చేసే సత్తా పాక్కు లేదు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

మోదీ సంచలన ప్రకటన! పీఓకే పాక్ అప్పగించాల్సిందే, ఆపరేషన్ సింధూర్ ముగియలేదు!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు 

మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #IPL2025 #IPLRestart #BCCI #IndiaVsPakistan #CeasefireTalks #ModiGovernment